Site icon NTV Telugu

TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ

Tspsc

Tspsc

TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి తమ వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ముందుగానే వచ్చిందని, విదేశాల నుంచి పరీక్షలు రాశారన్న ఆరోపణలపై ఈడీ విచారణ ప్రారంభించింది. కాగా, ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఇడి అనుమానిస్తోంది. అలాగే సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై కూడా ఈడీ దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయిందని అనుమానిస్తున్నారు. టీఎస్పీఎస్సీకి చెందిన శంకర్ లక్ష్మి, సత్యనారాయణలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

Read also: Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది. కాగా.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. దీంతో ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు పంపించారు. అయితే.. ఇవాళ (ఈ నెల 11)న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. ఎన్నారై ప్రశాంత్‌పై మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని చంచల్‌గూడ జైలులో ఉంచారు. వారిని రిమాండ్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ పేపర్‌ను లీక్ చేసి రేణుక, డాక్యా నాయక్‌తో పాటు పలువురికి విక్రయించినట్లు విచారణలో తేలింది. వీరి ద్వారా మరికొందరికి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.
China: యుద్ధానికి మేం సిద్ధం.. తైవాన్‌కు చైనా సవాల్

Exit mobile version