NTV Telugu Site icon

Munugode Symbols: ఢిల్లీకి మునుగోడు గుర్తుల పంచాయతీ.. వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం

Ec

Ec

EC To Modify Symbols List Munugode Candidates: మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితాను సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా..రిటర్నింగ్ అధికారి కేసును ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇవాళ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక.. మునుగోడు ఆర్వో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు రోలర్ గుర్తు మార్పుపై ఆర్వో నిర్ణయం ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ కోరాలని సీఈవోకు ఆదేశాలు జారీ చేశారు…ఆర్వోఏ వివరణపై సాయంత్రంలోగా నివేదిక పంపాలని అందులో పేర్కొన్నారు. దీంతో.. ఈసీ ఆదేశాల మేరకు ఫారం 7(ఏ)ని సవరించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు..మారిన గుర్తులతో బ్యాలెట్ ముద్రించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటుంది.

Read also: Lalan Paswan: హిందూ దేవతలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.

ఉప ఎన్నికల గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేరింది. మొదట రోడ్డు రోలర్ కేటాయించి, ఆ తర్వాత గుర్తు మార్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. రోడ్డు రోలర్‌ను కేటాయిస్తూ ఆర్‌వో సంతకం చేసిన కాపీని ఫిర్యాదుకు జత చేసినట్లు సమాచారం. జానయ్య గుర్తుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్థి ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ అధికారులు ఈ విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితోపాటు ఏఆర్‌వోను ఆదేశించారు. మార్కుల కేటాయింపుపై ఈసీ అధికారులను వివరణ కోరగా మళ్లీ రోడ్డు రోలర్ మార్కులు కేటాయించాలని కె.శివకుమార్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు…బ్యాలెట్లను ఇప్పటికే ప్రచురణకు పంపినట్లు స్పష్టం చేశారు.
Jogi Ramesh: రైతుల గోడు విన్నాం.. వారికిక మంచి రోజులు