Etela Rajender: కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారన్నారు. వాస్తవాలు, నిజాలను తెలుసుకోవటానికి కేసీఆర్ ఇష్టపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదన్నారు. వాస్తవాలు చెప్తే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ళు, నియామకాల విషయంలో కేసీఆర్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదిరి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీబంధు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదన్నారు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. హుజూరాబాద్ రిజల్ట్ గజ్వేల్‌లోనూ పునరావృతం అవుతుందని.. 7న గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరారు. ఆదివారం రాత్రి ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Purandeswari: విధానాలు ఎత్తిచూపిస్తే కోవర్ట్ అంటే ఎలా..? 175 స్థానాల్లో పోటీ..
