Site icon NTV Telugu

Dynamic Pricing : ఓలా అయ్యిందోలా..! కిలోమీటరుకి కిడ్నీ కావాలట..!

Dynamic Charges

Dynamic Charges

Dynamic Pricing : ఒకప్పుడు విమాన టికెట్లు కొనాలంటేనే భయం.. ఇప్పుడు అదే ధోరణి క్యాబ్‌ల్లోకూ విస్తరిస్తోంది. విమానాలు, రైళ్లు మాత్రమే అనుకున్న ‘డైనమిక్ ప్రైసింగ్’ వ్యవస్థ.. ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్‌ సేవలకు కూడా వాస్తవంగా రూపుదిద్దుకుంది. కేంద్ర రవాణా శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పీక్ అవర్స్‌లో రెండు రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసుకునే అధికారాన్ని ఈ సంస్థలకు ఇచ్చింది.

భారత ప్రభుత్వం 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను సవరించింది. ఇందులో భాగంగా, గరిష్ఠ సర్జ్ ప్రైసింగ్‌ను ఇప్పటి 1.5 రెట్ల నుంచి 2 రెట్లకు పెంచింది. అంటే ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో క్యాబ్ తీసుకుంటే మామూలు ధర కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.

Mohammad Shami : మొహమ్మద్ షమీకి షాకిచ్చిన హైకోర్ట్

డైనమిక్ ప్రైసింగ్ అనేది డిమాండ్ , సరఫరా ఆధారంగా ధరలను మారుస్తూ వసూలు చేసే విధానం. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో.. ఉదయం ఆఫీసు టైం, రాత్రి వెనక్కి ప్రయాణాలు చేసే సమయాల్లో .. ఈ ధరలు పెరుగుతాయి. వినియోగదారులకు తక్షణ సేవ అందించడానికే ఇదని ప్రభుత్వ వాదన. కానీ ఇది తక్కువ ఆదాయం గలవారికి, మధ్యతరగతికి పెనుభారం.

ఎవరో ఎక్కే విమానం, ఎక్కని రైలు ధరకే.. ఇప్పుడు క్యాబ్‌ కూడా? కిలోమీటర్‌కి కంటే గంటకి ఛార్జీలు ఎక్కువగా మారిపోయే పరిస్థితులు ఇవి. పని కోసం ప్రయాణించాల్సినవాళ్లకు, విద్యార్థులకు, డెలివరీ బాయ్స్‌కు ఇది పెద్ద చిక్కే. ప్రభుత్వానికి ఇది ‘సౌకర్యవంతమైన డిజిటల్ రవాణా’ అభివృద్ధి కావొచ్చు.. కానీ సామాన్యుడికి మాత్రం ఇది ‘కిడ్నీలు అమ్ముకునే’ వ్యయం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు.

Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు

Exit mobile version