Site icon NTV Telugu

రేపటి నుంచి దసరా సెలవులు

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తేడా లేకుండా రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఇచ్చినట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది… దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఆదేశాలను పట్టించుకోపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు.. దాదాపు 18 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే.. కోవిడ్ సమయంలో అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కాగా.. ఈ మధ్యే భౌతికతరగతులు ప్రారంభం అయిన విషయం విదితమే.

Exit mobile version