NTV Telugu Site icon

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఈనెల 16న ఖాతాల్లో 1.53 లక్షలు

Singaredni Emplyes

Singaredni Emplyes

Singareni: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దసగ పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగా, 2022-23 సంవత్సరంలో, కార్మికులకు గత సంవత్సరం లాభం కంటే 32 శాతం ఎక్కువ వాటా చెల్లించడానికి నిధులు విడుదల చేయబడ్డాయి. అయితే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇందులో 32 శాతం దసరా బోనస్‌గా రూ. 711.18 కోట్లు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఈ బోనస్ సొమ్మును ఈ నెల 16న సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అయితే ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.53 లక్ష చొప్పున బోనస్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 11వ వేతన ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కార్మికులకు 23 నెలల బకాయిలు చెల్లించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.1,450 కోట్లు చెల్లించింది. కాగా, మంచిర్యాల సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో కార్మికులకు వాటా కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. గతంలో ఇచ్చిన షేర్ కంటే.. ఏకంగా 32 శాతం షేర్ ప్రకటించారు. దీంతో.. ఈ ఏడాది.. సింగరేణి కార్మికుల ముఖాల్లో రెట్టింపు ఆనందం వెల్లివిరుస్తోంది.

Read also: ENG vs NZ: పాపం డెవాన్ కాన్వే.. ఆ ఆనందంను 15 నిమిషాలు కూడా ఉంచని రచిన్‌ రవీంద్ర!

సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ కింద దసరా కానుకగా రూ.711.18 కోట్లు ఈ నెల 16న చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు ద్వారా వచ్చిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతం దసరా పండుగకు వారం రోజుల ముందు చెల్లిస్తున్నట్లు తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ను అందుకుంటారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న కార్మికులకు సింగరేణి ఉద్యోగుల తరపున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపునకు సంబంధించి డైరెక్టర్ ఎన్ బలరాం గురువారం సర్క్యులర్ జారీ చేశారు.