NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : అన్ని రంగాలలో అంచలంచలుగా మార్పులు తీసుకువస్తున్నాం

Damodara

Damodara

Duddilla Sridhar Babu : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నర్సింహ విద్యార్థుల హాస్టల్‌ను పరిశీలించారు. పెరిగిన మెస్ చార్జీల కు సంబంధించిన మెనూ బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రు శ్రీధర్‌బాబు, రాజనర్సింహ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Kiren Rijiju: మైనార్టీల ప‌ట్ల వివ‌క్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..

ప్రభుత్వం విద్యా, వైద్యం రెండు ప్రధాన అంశాల అభివృద్దే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలలో పోషకాలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో మెనూలో మార్పులు తీసుకురావడానికి చార్జీలు పెంచడం జరిగిందన్నారు. 9 సంవత్సరాల తర్వాత 40 శాతం డైట్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం అన్ని రంగాలలో అంచలంచలుగా మార్పులు తీసుకువస్తున్నామన్నారు.

PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి