NTV Telugu Site icon

MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్.. కారణం ఇదే..

Raghunanadan Rao

Raghunanadan Rao

MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జులై 05న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో అక్కడకు బయలుదేరారు. గజ్వెల్లోని బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హకీంపేటలో రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్నారు.

Read also: Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్‌.. గజ్వేల్‌లో కేసు నమోదు

గజ్వేల్‌లో శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గజ్వేల్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయవద్దని పోలీసులు సూచించారు. గజ్వేల్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును హకీంపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అతన్ని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రఘునందన్ రావుతో ఫోన్ లో మాట్లాడారు. రఘునందన్ రావు అరెస్టును ఈటల రాజేందర్ తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు.
Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్‌.. గజ్వేల్‌లో కేసు నమోదు