NTV Telugu Site icon

Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రోగ్రాం ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కుమార అమ్మిరేశ్ అనే డీఎస్పీ క్యాడర్ అధికారి మృతి చెందారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఇక కార్యక్రమం ఏర్పాటు పైన నివేదిక ఇవ్వడం కోసం రిహార్సల్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ స్టేజి సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన డీఎస్పీని ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. డీఎస్పీ స్థాయి అధికారి మరణంతో విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి

శుక్రవారం నాడు నేను పాల్గొననున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, హైదరాబాద్ శిల్పకళావేదికలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఇంటిలిజెన్స్ విభాగ పోలీసు అధికారి శ్రీ కుమార్ అమిర్నేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి మృతి అత్యంత విచారకరం. కుమార్ అమిర్నేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు.

హత్యకేసు ముద్దాయికి జీవిత ఖైదు, జరిమానా

హత్య కేసు ముద్దాయికి జీవిత ఖైదు తో పాటు జరిమానా విధించింది న్యాయస్థానం. 2011 వ సంవత్సరంలో తాండూర్ (మం)అంతారం ఎడ్ల బజార్ దగ్గర తాండ్ర వెంకటయ్య దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నారం గ్రామానికి చెందిన మధరమ్మను ప్రేమించానని తన వెంబడి 15 రోజులు తీసుకొని వెళ్ళాడు తాండ్ర వెంకటయ్య. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చి వదిలేయడంతో కోపోద్రిక్తుడయ్యాడు మధరమ్మ సోదరుడు మర్పల్లి అశోక్ . అంతారం ఎడ్ల బజార్ దగ్గర తాండ్ర వెంకటయ్య ను దారుణంగా నరికి చంపేశాడు మర్పల్లి అశోక్. నిందితుడు అశోక్‌ కి వికారాబాద్‌ న్యాయస్థానం శిక్ష విధించింది. అశోక్‌ కి జీవితఖైదు తో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది వికారాబాద్ కోర్టు.

Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం