NTV Telugu Site icon

DSC Exam Key: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల

DSC Exam Key: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్ లైన్ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ ను పాఠశాల విద్యా శాఖ అధికారులు వెబ్ సైట్ లో పెట్టారు. ఈ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ జరిగాయి. ఒక వేళా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. ఇక, డీఎస్సీకి మొత్తం 2, 79,957 దరఖాస్తులు రాగా.. 2,45,263 మంది ( 87.61 శాతం ) హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు.. అత్యధికంగా సెకండరీ గ్రేట్ టీచర్ ( ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Dsc

Show comments