Akbaruddin Owaisi: డీఎస్సీ నోటిఫికేషన్ పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఉర్దూని డీఎస్సీలో చేర్చాలని ఎంఐఎం అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ ను నేను ఎప్పుడు తలచుకుంటాను ఎందుకంటే ఆయన అందరిని ఆదరించే మనస్తత్వం కాలవారన్నారు. మేము కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని ఎవరైనా అంటే.. అవును మేము రాజశేఖర్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని స్పష్టం చేశారు. ఆయన ఆదరణ, ప్రేమ వల్ల మేము కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని తెలిపారు. మేము ఎమైన బాధలు చెప్పుకున్నా దానిని ఆయన ఆదరించి నిర్వర్తించే వారు కాబట్టే మేము రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా వున్నామన్నారు. అందుకే కాంగ్రెస్ పాలనను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. డీఎస్సీలో ముస్లిం లకు చేర్చండి అని అన్నారు. డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఉర్దూని కూడా చేర్చాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉర్దూ రాదన్నారు. చట్టం ఎస్సీ, ఎస్టీ లకు పోస్ట్‌లు ఇవ్వమంటే డీఎస్సీని రెండు సార్లు ఇవ్వాలని కోరారు. డీఎస్సీ నోటిఫికేషన్ రెండు సార్లు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉర్దూకు సంబంధించినవి భర్తీకానివి భర్తీ అవుతాయని అన్నారు. ఇది చాలా ముఖ్యమైనది అన్నారు. ఎన్ని కాంపిటేటువ్ పరీక్షలు వున్నాయో, ప్రమోషన్ ఎగ్జామ్స్‌లో డిపార్ట్ మెంటల్ అన్నింటిలోనూ ఉర్దూను చేర్చాలని అసెంబ్లీలో కోరారు. ఇది చాలా అవసరమని.. కానీ ఈ పని జరగడం లేదని అన్నారు.
Read also: Audimulapu Suresh: 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు..
ఇప్పటివరకు ఎన్ని అయితే రిక్రూట్ మెంట్ పరీక్షలు వున్నాయో వాటన్నింటిని ఉర్దూలో పెట్టండి అన్నారు. కాంగ్రెస్- హామీలు చాలా ఇచ్చారని అన్నారు. ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలు తీర్పు ఇచ్చారు…ఎవరి బాధ్యతలు వారికి ప్రజలు అప్పగించారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్టీ హామీలను అమలు చేయాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని కామెంట్స్ సరిగా లేవన్నారు. బీఆర్ఎస్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇస్తుందా అని అడుగుతున్న? అని ప్రశ్నించారు. మైనార్టీలు, బీసీలకు ప్రత్యేక సభ్ ప్లాన్ కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నంను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలకులకుగా చాలా అనుభవం ఉంది…వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు అనుకుంటా అన్నారు. 3 లక్షల 10 వేల కోట్ల రూపాయలు కావాలి …కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు కాంగ్రెస్ అన్ని చూసే మ్యానిఫెస్ట్ తయారు చేశారు అనుకుంటా అని అక్బరుద్దీన్ తెలిపారు.
Audimulapu Suresh: 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు..
