NTV Telugu Site icon

Telangana DSC: తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ..

Telangana Dsc

Telangana Dsc

Telangana DSC: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసి టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతే స్కూల్ అసిస్టెంట్‌లో రెండు మెథడాలజీ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

Read also: Italy Water Crisis : ఇటలీలో తీవ్ర నీటికొరత… దయచేసి పర్యాటకులు తమ దేశానికి రావొద్దని విజ్ఞప్తి

ఆ లెక్కన ఒక్కో పోస్టుకు దాదాపు 25 మంది పోటీ పడుతున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులు రాగా, నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. 5శాతం స్థానికేతర కోటా ఉండడంతో ఇతర జిల్లాల వారు కూడా హైదరాబాద్ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. మేడ్చల్ జిల్లా నుంచి 2,265 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు వచ్చాయి. డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో టెట్‌లో అర్హత సాధించిన వారిలో 23,919 మంది ఫీజు చెల్లించకుండానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జూలై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Aravind Kejriwal : 8కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళన వ్యక్తం చేసిన ఆప్