ఇటీవల కొంత మంది యువత మద్యం మత్తులో ఎలా, ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా తాగి రోడ్లపై రచ్చ చేస్తూ, చూసేవారికి ఇబ్బంది కలిగించే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసింది. రోడ్డుమధ్యలో నిలబడి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుని, డ్రైవర్లతో మాటల తేడాలు పెట్టుకుంది. యువతిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా వెనక్కు నెట్టేసింది. “మీరు ఆంధ్రావాళ్లు కాదు… నేను ఆంధ్రాకు వెళ్లాలి” అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేసింది. చివరకు పోలీసులు ఆమెను ఓ ఆటోలో ఆసుపత్రికి తరలించారు. యువతి పేరు ఇందు అని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
“అక్క… ఏ బ్రాండ్ తాగావు?” అంటూ కొందరు సరదా కామెంట్లు పెట్టగా,“ఒకప్పుడు అబ్బాయిలే రోడ్లపై గొడవ చేసేవారు… ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే దారిలో నడుస్తున్నారు” అంటూ మరికొందరు స్పందించారు.
