Warangal: నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారుతోంది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు ఆడ్డు అదుపూ లేకుండా పోతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అర్థరాత్రి అయ్యందంటే రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్‌చల్ చేస్తున్నారు. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి తల్వార్ తో షాప్ లో వెళ్లి హల్ చల్ చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.
Read also: Health Tips: నిద్రలో మాట్లాడుతున్నారా? ఐతే పెద్ద సమస్యకే దారి తీయవచ్చు
వరంగల్ జిల్లాలో మధు అనేవ్యక్తి అఖిలబార్ కి వెళ్ళాడు. ఫుల్ గా మందు తాగాడు. ఇంకా కావాలని డిమాండ్ చేశాడు. అయితే బార్ క్యాషియర్ ముందు ఇప్పటి వరకు తాగిన దానికి డబ్బులు కట్టాలని అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మధు బయటకు వెళ్లాడు. తమ వెంట తల్వార్ తెచ్చి ఫుల్ బాటిల్ కావాలని బెదిరించాడు. భయాందోళనకు గురైన బార్ షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బార్ వద్దకు చేరుకున్న పోలీసులకు మధు చుక్కలు చూపించాడు. ఫుల్ బాటిల్ ఇస్తేనే వస్తానంటూ మెండికేశాడు. దీంతో విసుగు చెందిన పోలీసులు మధుని మాటల్లో ఉంచి అదుపులోకి తీసుకున్నారు. మధు గతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ఇదివరకే మదు పై రౌడీ షీట్ కేసు నమోదైందని అన్నారు. మద్యం మత్తులో పుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేడని అన్నారు. సిబ్బంది డబ్బులు అడగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపటి తర్వాత తల్వార్ తో వచ్చి క్యాషియర్ చంపుతానని బెదిరించాడని అన్నారు. క్యాషియర్ రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Smart Cities Awards: ఇండియాలో అదే స్మార్ట్ సిటీ.. ఎందుకో తెలుసా?