Drugs Busted: అత్తాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Busted: హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో నిర్వహించిన మెరుపు దాడుల్లో 8 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు భారీ మొత్తంలో మెఫెంటెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌తో పాటు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.
డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ బృందం అత్తాపూర్‌లోని జలాల్ బాబా నగర్లో ఉన్న అబ్దుల్ హసన్ నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇంట్లో దాచి ఉంచిన MDMA డ్రగ్స్ తోపాటు భారీ సంఖ్యలో ఇంజెక్షన్లు లభించాయి. ప్రాథమిక విచారణలో అబ్దుల్ హసన్ బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే గుజరాత్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించి, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వాటిని నగరంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read
- CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
- Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
- IVF Scam : ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం... 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు!
- Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
శరీర దారుఢ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులు ఈ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి ఇంజెక్షన్ల విక్రయం చట్టవిరుద్ధమని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దారి దోపిడీ, హత్య, రౌడీషీటర్ కేసులతో పాటు ఇటీవల పాతబస్తీలో జరిగిన హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.
అబ్దుల్ హసన్, ముజాహిద్ వద్ద నుంచి MDMA డ్రగ్స్, భారీ సంఖ్యలో ఇంజెక్షన్లతో పాటు పలు ప్రాణాంతక ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు.. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక మరెవరు ఉన్నారు.? సరఫరా వ్యవస్థ ఎలా సాగుతోంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్‌పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
-
IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?