Drugs Control Officers: నగరంలో డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు మెడికల్ షాపుల లైసెన్సుల రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Control Officers: నగరంలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తున్న దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా డ్రగ్స్ టాబ్లెట్స్ అమ్ముతున్న మెడికల్ షాప్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నగరంలోని 20 మెడికల్ షాప్ లపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ న్యూ తోపాటుగా డ్రగ్స్ కంట్రోల్ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ దందా బయటపడింది.యువతకు మెడికల్ షాప్ యజమానులు మత్తు టాబ్లెట్స్ అల్ఫాజూలు అమ్ముతున్నట్లు గుర్తించారు. మత్తు టాబ్లెట్స్ కు అలవాటు పడ్డ యువకులు నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బుకు ఆశపడి మెడికల్ యజమానులు మొత్తం టాబ్లెట్స్ అమ్ముతున్నట్లు తెలిపారు. అక్రమంగా మందులు అమ్మకాలు జరిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పలు మెడికల్ షాపులపై అధికారులు దాడులు నిర్వహించి.. లైసెన్సులను రద్దు చేశారు.
Also Read
లైసెన్సులను రద్దు చేసిన మెడికల్ షాపులు ఇవే..
* కోఠి ఇందర్ బాగ్ లోని గణేష్ ఫా ర్మాస్యూటికల్స్, అంబర్ పేటలోని బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్ అంబర్పేట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
* నాంపల్లిలో సర్దార్ మెడికల్ హాల్ 3 రోజులు సస్పెండ్ చేశారు.
* అక్షయ మెడికల్, జనరల్ స్టోర్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
* నాంపల్లిలోని హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వారం రోజుల పాటు అమ్మకాలు నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశారు.
* లంగర్ హౌస్ ఆర్ఎస్ వైద్య సాధారణ దుకాణాలు రద్దు
* చార్మినార్ లోని భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మూడు రోజుల సస్పెన్షన్.
* హుమాయున్ నగర్ లో అల్హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ 15రోజులు అమ్మకాలు నిలివేశారు.
* ఉప్పల్లోని శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్
* గౌలిగూడలోని గోకుల్ మెడికల్ షాప్ రెండు రోజులు,
* చార్మినార్ లోని మీరా మెడికల్ షాప్ను వారం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని మెడికల్ షాపుల్లో కొన్ని రకాల మందుల విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులకు అనుమానం వచ్చింది. . డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు.
Sreeleela : మహేష్ సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉంటుందో తెలుసా..?
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!