మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తూ ఎక్కడైనా గుంపులుగా కనిపిస్తే పోలీసులు వెంటనే చర్యలు చేపడుతారని తెలిపారు.
మంచిర్యాల జిల్లా పరిధిలో డ్రోన్ నిఘా!
