NTV Telugu Site icon

Karimnagar: షీటీం మ‌హిళా కానిస్టేబుల్ అడ్డ‌గించిన మందుబాబులు.. త‌రువాత‌

She

She

కరీంనగర్ జిల్లాలో మందుబాబులు హ‌ల్ చ‌ల్ సృష్టించారు. ద్విచ‌క్ర వాహ‌నం పై వెలుతున్న మ‌హిళ‌ను అడ్డంగించడ‌మే కాకుండా.. ఆమె పై దుర్భాష‌లాడారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మందుబాబుల భ‌ర‌తం ప‌ట్టారు.

ఇక వివరాల్లోకి వెళితే.. షీటీం మ‌హిళా కానిస్టేబుల్ హైదరాబాద్ నుండి మంచిర్యాల వెళ్తుతోంది. దీంతో అక్క‌డున్న మ‌ద్యం మ‌త్తులో వున్న ఐదుగురు యువ‌కులు ఆమెను అడ్డగించారు. ఆమె షీ టీం కానిస్టేబుల్ అని చెబుతున్నా విన‌కుండా ఆ మాట‌లు ప‌క్క‌న పెట్టి, ఆమె ముందుకు వెల్ల‌కుండా కారును అడ్డంగా పెట్టారు. అంతేకాకుండా.. ఆమెపై దురుసుగా ప్రవర్తంచడమే కాకుండా.. దుర్భాష‌లాడారు. దీంతో ఆమె పోలీసుల‌కు స‌మాచారం అందించింది. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు ఐదుగురు మందుబాబుల‌ను అదుపులో తీసుకుని పోలీస్టేష‌న్ కు త‌ర‌లించారు. ఐదుగురు యువకులు రేణికుంట టోల్ ప్లాజా వద్ద గొల్లపల్లికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు చోటుచేసుకోకుండా షీటీం ను ప్ర‌భుత్వం ప్ర‌తి ష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. అలాంటిది షీటీం కానిస్టేబుల్ నే మందుబాబులు చేసిన ఈఘ‌ట‌న షాక్ కు గురిచేసింది. షీటీం మ‌హిళా కానిస్టేబుల్ కే ఇంత‌టి ప‌రిస్థితి వ‌స్తే ఇక మిగ‌తా ఆడ‌వారి ప‌రిస్థితి ఏంట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నా ప‌లువురు మ‌హిళ‌లు. ఇప్ప‌టికే తెలంగాణ పోలీసు యంత్రంగా మ‌హిళ‌లపై ఎటువంటి అఘాయిత్యాలు జ‌ర‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఎక్క‌డో ఒక చోట ఇలాంటి ఘ‌ట‌న‌లు జరుగుతునే ఉన్నాయి.