Dr Vaishali Talks About Her Kidnap Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో.. బాధితురాలు మరోసారి నవీన్ రెడ్డి వాదనల్ని తోసిపుచ్చింది. నవీన్ రెడ్డి చెప్తున్నట్టు.. పెళ్లి నిజం కాదని, ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసినవి అని స్పష్టం చేశారు. తన ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకొని.. గానాబజానాతో నవీన్ రోజూ హంగామా చేసేవాడని పేర్కొంది. అంతేకాదు.. తన పేరిట నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, వీడియోలు పోస్ట్ చేశాడని తెలిపింది. నవీన్ రెడ్డి తనను ఏడాదికాలం నుంచి వేధిస్తున్నాడని, గతంలోనే తాను ఒకసారి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. అయితే.. ఆ సమయంలో పోలీసులు మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. మరోవైపు.. ఈ కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 32 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు. మరోసారి వైశాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
Constable Shalini Chauhan: లేడీ కానిస్టేబుల్‌కి హ్యాట్సాఫ్.. స్టూడెంట్‌గా మారి, ఆ కేసుని ఛేధించింది
ఇంతకుముందు కూడా వైశాలి తన కిడ్నాప్ వ్యవహారం గురించి పూర్తి వివరాల్ని వెల్లడించింది. నవీన్ తన పట్ల ఘోరంగా ట్రీట్ చేశాడని, మొత్తం పది మంతి దారుణంగా వ్యవహరించారని పేర్కొంది. తాను ప్లీజ్ అని వేడుకున్నా పట్టించుకోకుండా.. కాళ్లు పట్టుకొని తనని కారులో విసివేశారని, నవీన్ తనని కార్‌లో కొట్టాడని తెలిపింది. చెప్పినట్టు వినకపోతే.. తన తండ్రిని చంపేస్తానని నవీన్ బెదిరించాడని చెప్పింది. తన లైఫ్, కెరీర్‌ని నవీన్ పాడు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు నవీన్ ఏమాత్రం ఇష్టం లేదని, తమకు మ్యూచువల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండటం వల్ల అతనితో ఫ్రెండ్లీగా ఉన్నానని తెలిపింది. తామిద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లమని, ఆ క్రమంలోనే తనని పెళ్లికి ప్రపోజ్ చేస్తే, తమ పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పానంది. పెళ్లి విషయంలో ఇష్టం లేదని చెప్పినప్పటి నుంచి.. వేధించడం మొదలుపెట్టాడని వెల్లడించింది. తనకు, నవీన్‌కి పెళ్లైందని చెప్తున్న రోజు తాను ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, అందుకు ఆధారాలూ ఉన్నాయంది. తనని కిడ్నాప్ చేసిన నవీన్‌తో పాటు అతడ్ని సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
Revanth Reddy: రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది