Site icon NTV Telugu

Dowry Harassment: వరకట్న వేధింపులకు యువతి ఆత్మహత్య.. వాట్సప్ వీడియో వైరల్

Nurjahaan

Nurjahaan

Dowry Harassment: వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలకు నచ్చచెప్పి పెళ్లి పీఠలు ఎక్కారు. పెళ్లి చేసుకుని అన్యోన్యమైన జీవితంలో అడుగుపెట్టిన వారి జీవితంలో కొద్ది రోజులుగా సాఫీగా సాగింది. ఆతరువాత భర్త, అత్తమామలు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని వేధించడంతో భరిస్తూ వచ్చిన ఆయువతి చివరకు తనువు చాలించాలని పిక్స్‌ అయ్యింది. ‘కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రేమగా చూసుకుంటా’నంటూ అతడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త కూడా తనకు దూరమవడం అత్తమామలతో కలిసి భర్త కూడా వరకట్నంకోసం వేధించడంతో ఆమె ఇక తన జీవితంలో సంతోషం లేదనుకుంది.

అత్తింట్లో తనకు ఇకచోటులేదనుకున్న ఆయువతి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆత్మాహత్యాయత్నానికి పాల్పడి హైదారబాద్‌లోని ఖానాపుర్‌ కు చెందిన నూర్జహాన్ స్వయంగా వాయిస్ రికార్డింగ్, వాట్సప్ లో వీడియోలు పెట్టడడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈవిషయమై పలు పోలీస్ స్టేషన్ ల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నూర్జహాన్‌ వాపోయింది. నేటి యువత ప్రేమపేరుతో తన జీవితాన్ని నాసనం చేసుకుంటుంది. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపింది. మరే అమ్మాయి ప్రేమ పేరుతో మోస పోవద్దని పేర్కొంది. ప్రేమపేరుతో పెళ్లి చేసుకున్న తనభర్త, అత్తమామలతో కలిసి తనకు నరకం చూపించాడని ఈవీడియోలో తెలిపింది. గీసుగొండ సమీపంలో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kerala High Court: గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అక్కర్లేదు..

Exit mobile version