NTV Telugu Site icon

Double Decker Skyway: పోలా అదిరిపోలా.. పైన మెట్రో.. మధ్యలో ఫ్లైఓవర్‌..!

Double Decker Skyway

Double Decker Skyway

Double Decker Skyway: హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగరంలో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండడంతో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల పరంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జిలు నిర్మించారు. ఇటీవల శంషాబాద్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీ నదిపై స్కైవే నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తాజాగా నగరానికి వరంగా మారే మరో ప్రతిపాదన సిద్ధమైంది. జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి సమీర్‌పేట మధ్య డబుల్ డెక్కర్ స్కైవే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్మాణంతో హైదరాబాద్ – కరీంనగర్ మార్గంలో ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుంది.

Read also: Pawan Kalyan: ‘బ్రో’ ట్రైలర్ టాక్… మనల్ని ఎవడ్రా ఆపేది

తాజాగా ఈ స్కైవే ప్రతిపాదన కేంద్రం వద్ద పెట్టగా.. సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడు మెట్లు ఉంటాయన్నారు. పైభాగంలో మెట్రో రైలు, మధ్యలో ఫ్లైఓవర్, దిగువన రోడ్డు ఉంటుందని తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ స్కైవే పనులు పూర్తయ్యే నాటికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినోద్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్‌ మార్గంలో జేబీఎస్‌ నుంచి సమీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల పొడవున డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ కు సాఫీగా ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో చర్చించినట్లు వినోద్‌కుమార్ వెల్లడించారు. వీరి చర్చల ఫలితంగా ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్లు వెల్లడించారు.
NTR: రక్తపాతం సృష్టిస్తున్న సముద్ర వీరుడు…