విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యాశాఖ. డిగ్రీలో ప్రవేశాలకోసం నిర్వహించే దోస్త్ అప్లికేషన్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఉన్న విద్యా మండలి వెల్లడించింది. అయితే మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాలలో బాలికలు సత్తా చాటారు.
అయితే ఈ క్రమంలోనే డిగ్రీ ప్రవేశాలకు ఆలస్యం కాకుండా ఉండేందుకు దోస్త్ దరఖాస్తుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విద్యాసంవత్సరాన్ని వృధా కాకుండా ఉండేందుకు 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
