Site icon NTV Telugu

Minister Ktr: వేరేవాళ్లను నమ్మితే వందేళ్లు వెనక్కే..

Ktr

Ktr

Minister Ktr: వేరేటోళ్ళను పొరపాటున నమ్మినా తెలంగాణ మళ్ళీ వెనక్కి వందేళ్లు వెళ్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని తెలిపారు. అందుకే కేసీఆర్ ఒక్కడు చాలు వారికి అదే పదివేలు అన్న మనస్తత్వం రైతులది అని అన్నారు. పొరపాటున ఇతరులను నమ్మినా తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని తెలిపారు.

అయితే.. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటించారు. ఈనేపథ్యంలో.. సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోనూ సవరిస్తామని మేలు చేస్తామని వెల్లడించారు. పలుచోట్ల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నేను ఒకప్పుడు రైతునే రైతుల కష్టాలేంటో నాకు తెలుసు.. అధైర్యపడొద్దు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు.

Exit mobile version