Dogs Attacks: వరంగల్ నగరంలో వీధికుక్కలు దాడి రోజు రోజుకు పెరుగుతుంది. చిన్నారులు గాయపడుతున్నా అధికారులు మాత్రం స్పందించడంలేదు. తాజాగా వీధికుక్కల దాడిలో కాజీపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇవాళ (శనివారం) ఉదయం బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు తెగబడ్డాయి. చిన్నారిని విచక్షణారహితంగా కొరికి మెఖంపై గాటువేశాయి. అక్కడే వున్న మరో బాలుడిపై కూడా దాడికి దిగాయి. అయితే ఇద్దరు చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినా ఇద్దరు చిన్నారిపై దాడి చేస్తునే ఉన్నాయి. చిన్నారులను పీక్కుంటూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాయి.
Read also: Yash : కోట్లు ఖరీదైన కారు కొన్న హీరో యష్..!!
అయితే స్థానికులు ఆ కుక్కలపై దాడి చేయడంతో పిల్లలను వదిలేశాయి. తీవ్ర గాయాలైన ఇద్దరు చిన్నారులను స్థానికులు హుటా హుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు ఈ ఘటన తరువాత ఆగ్రహంతో రగిలిపోయారు. చిన్నారులపై దాడిచేసిన కుక్కను వెతికి పట్టుకుని చంపేశారు. మరొక చిన్నారిపై దాడి చేయకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశామని అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఘటన అనంతరం వరంగల్ మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడతామని చెప్పినా ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో అమాయక ప్రజలు వీధికుక్కల బారిన పడుతున్నారని మండిపడుతున్నారు. మునిసిపల్ అధికారులపై, ప్రజాప్రతినిధులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని.. వేసవిలో చాలామంది బయటనే పడుకుంటున్నామని దీంతో కుక్కటు చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తున్నాయని వాపోతున్నారు.
రెండు రోజుల క్రితం వరంగల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో పాటు వృద్ధురాలిపై కూడా వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. దాడిలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వరంగల్‌లోని బట్టల బజార్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ దంపతులపై వీధికుక్కలు దాడి చేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ కుక్కల దాడిని చూసి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై కుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికులు సకాలంలో స్పందించి కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్, వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
War 2: ‘దేవర’ డైడ్‌లైన్ ఫిక్స్.. ‘వార్ 2’ రంగం సిద్ధం!