Doctors Day Celebrations In Ozone Hospitals: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత ఓజోన్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కొత్తపేట అల్వాల్ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు కలిగి, నగర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం తమ కొత్తపేట హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా హాస్పిటల్‌లో పనిచేస్తున్న సహచర డాక్టర్లతో కలిసి ఓజోన్ హాస్పిటల్స్ చైర్మన్ బి.వి.సత్యసాయి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ జి.దీప్తి, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డాక్టర్ ఎం.కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్ వై.మధుసూదన్ రెడ్డిలతో కలిసి కేక్ కట్ చేశారు.
Margani Bharat: పవన్‌కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?
అనంతరం హాస్పిటల్ చైర్మన్ బి.వి సత్యసాయి ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా, ప్రపంచంలోనే అత్యంత గొప్ప వైద్యులు, బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బీదన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం వారు అందించిన సేవలకు గుర్తుగా వారి జయంతి & వర్ధంతి రోజు అయిన జులై 1న ప్రతి సంవత్సరం దేశంలో నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నట్లు వివరించారు. కనిపించని ఆరాధించే దేవుడు మనకు జన్మనిస్తే, మన కళ్ళ ముందు కనిపించే వైద్యుడు అనుక్షణం మన ఆరోగ్యాలు కాపాడుతూ ఎన్నో పునర్జన్మలు ప్రసాదిస్తున్నాడని అన్నారు. హాస్పిటల్లోని వైద్యులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
Minister Venugopala Krishna: పవన్‌కి మంత్రి వేణు స్ట్రాంగ్ కౌంటర్.. బాబు ట్రాప్‌లో..
ఆ తర్వాత హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. పేషంట్ల సేవ కోసం, వారి వ్యాధి బాధలను తగ్గించడం కోసం, రోగుల ప్రాణాలను కాపాడి వారి జీవితాలు నిలబెట్టడం కోసం డాక్టర్లు తమ జీవితాలను అంకితం చేస్తారని అన్నారు. డాక్టర్ వృత్తి నిర్వహణలో భాగంగా ఎంతోమంది వైద్యులు ప్రాణాలను సైతం కోల్పోతున్నా లెక్క చేయరని, అటువంటి వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు. వైద్య రంగంలో గొప్ప సేవలు అందించిన అటువంటి వైద్యులను స్మరించుకోవడమే నిజమైన డాక్టర్స్ డే అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అన్ని విభాగాల సిబ్బంది, రోగులు, తదితరులు పాల్గొన్నారు.
