NTV Telugu Site icon

Bhuvanagiri Hospital: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి… డాక్టర్ నిర్లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలయింది. తుర్కపల్లి, రాజపేట్ పీహెచ్‌సీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం జిల్లా ఆస్పత్రికి వంద మంది మహిళ. పి.హెచ్.సి ఏ.ఎన్.ఎంలు తీసుకొని వచ్చారు. బీపీఎల్ క్యాంప్ లో భాగంగా…మహిళల కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయడానికి తీసుకొచ్చారు వైద్య సిబ్బంది.

పన్నెండు మంది మహిళలకు ఆపరేషన్ కోసం సిద్ధం చేశారు. అయితే వారికి మత్తు ఇంజక్షన్ చేసి మధ్య వదిలి వెళ్ళిపోయారు డాక్టర్. నేను ఆపరేషన్ చేయను అని వెళ్లిపోయాడా డాక్టర్. ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు మహిళలు. డాక్టర్ నిర్లక్ష్యం పట్ల ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్నారు కుటుబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలు. డాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.