Site icon NTV Telugu

కేసీఆర్ చెప్పిన‌ట్లు విన‌డానికి.. రైతులు కార్య‌క‌ర్త‌లు కాదు : డీకే అరుణ‌

యాసంగి కాలంలో.. వ‌రి వేసిన రైతుల‌కు రైతు బంధు క‌ట్ చేస్తామ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. రైతు బంధు పై అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు డీకే అరుణ ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం పై నెపం మోపి తప్పించుకోవాలని సీఎం కేసీఆర్‌ చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. రైతు బంధు పేరుతో… సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఆగ్ర‌హించారు.

సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు వినడానికి రైతులు… టీఆర్ ఎస్‌ పార్టీ కార్యకర్తలు కారని స్ప‌ష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల పై రైతుల కు అవగాహన కల్పించకుండా… వరి పంట వేయొద్దని చెప్పడం కరెక్ట్ కాదని మండిప‌డ్డారు. కేంద్రం ధాన్యం తీసుకో మని ఎప్పుడు చెప్పలేదు… బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని చెప్పిందని తెలిపారు డీకే అరుణ‌.

Exit mobile version