NTV Telugu Site icon

DK Aruna: కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా..? డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

Dk Aruna

Dk Aruna

DK Aruna: కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా..? బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపైనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read also: CM Revanth Reddy: నేటితో కాంగ్రెస్‌ పాలనకు నెల రోజులు.. స్పెషల్ ట్వీట్ చేసిన సీఎం రేవంత్

జుడిషియల్ ఎంక్వైరీ అంటే కాలయాపన చేయడమే అని ఆరోపించారు. మెడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం పంపులు మునగడం ప్రాజెక్టు డిజైన్ లోపం, నాణ్యత లోపమే కారణమని అన్నారు. వెంటనే చర్యలు తీసుకునే విధంగా సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు వంద రోజుల టైమ్ అడిగారని, వారు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు. కేంద్రం నిధులు ఇస్తధని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పక వస్తాయన్నారు. గతంలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.
Komuravelli Mallanna: వైభవంగా మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Show comments