DK Aruna: లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందని మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. జీవో 46 తో పాలమూరు జిల్లా యువత ఉద్యోగాలు నష్టపోతున్నారన్నారు. తక్షణమే జీవో 46 రద్దు చేసి గ్రామీణ ప్రాంత యువతకు న్యాయం చేయాలన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేసి ఖాళీలు పూర్తిగా భర్తీ చేస్తాం అన్నారు. 40వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి… మళ్ళీ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు.
పరీక్ష ఫీజు పెంచి ఉద్యోగార్థులపై భారం వేస్తున్నారని తెలిపారు. ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగతంగా మహిళా అని చూడకుండా నన్ను ధూషిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అవమానిస్తుంటే మీ విలువ పెరగడం లేదు… దిగజారుతోందని మండిపడ్డారు.
Read also: Mallu Bhatti Vikramarka: కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తాం..
అరుణమ్మ కల్తీ రక్తం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ సోనియా గాంధీ ఇదే నేర్పిస్తున్నారా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎవరి పక్షాన పోరాటం చేయలేదు… జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం లేదని తెలిపారు. లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందన్నారు. అధికారం, అహంకారంతో విర్రవిగితే కేసిఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకు కూడా ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి ఉన్నడంటే సిగ్గు అవుతోందన్నారు. దశాబ్దాల పాటు జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన కుటుంబం మాదని తెలిపారు. మోడీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponguleti Srinivasa Reddy: కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదు..