BJP National Vice President DK Aruna Made Comments On CM KCR.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా టీఆర్‌ఎస్ వాళ్ళే అని పరిగణించాలన్నారు. కేసీఆర్‌కి బీజేపని చూస్తే కల్లోకి రావడమే కాదు వణుకు పుడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్.. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం కోల్పోయారని, ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్ రూపొందించారన్నారు. కేసీఆర్ అంకెల గారడీతో మోసం చేశారని, కేసీఆర్ బండారాన్ని ఈటల బయటపెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.
ఏ పథకమైనా సరే అందులో అవినీతిని బయట పెడుదామంటే భయపడి అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని, 4 రాష్ట్రాల్లో గెలుపుతో కేసీఆర్ నోట మాట పడిపోయిందన్నారు. అంతకుముందు వరకు ఫ్రంట్ పెడతా అని అన్ని రాష్ట్రాల తిరిగారని, 4 రాష్ట్రాల గెలుపుతో భయపడి సైలెంట్ అయ్యారన్నారు. కేసీఆర్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని ఆయన మండిపడ్డారు.
