Site icon NTV Telugu

DK Aruna : వాళ్లకు అంత స్టేటస్‌ లేదు

Dk Aruna

Dk Aruna

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న అమిత్‌ షాకు 20 మంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొత్తగా సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ ప్రారంభించిన అనంతరం నోవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు.

ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అమిత్ షా పర్యటనపై కొందరు ప్రశ్నలు సంధిస్తూ.. ట్విట్స్‌ చేశారని.. వారికి సమాధానం మేమే చెబుతామన్నారు. అంతేకాకుండా అమిత్‌ షా సమాధానం చెప్పేంత స్టేటస్‌ వాళ్లకు లేదన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అమిత్‌ షా చెప్పారన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది.. ఇవ్వంది వాళ్ల నాన్నకు తెలుసునని.. చిన్నపిల్లాడిలా క్వశ్చన్‌లు వేసేవాళ్లకు అన్సర్‌ నేను అన్సర్‌ చెప్పాల్సిన పనిలేదని.. మీరు చూసుకొండి అని అమిత్‌ షా చెప్పారన్నారు.

Exit mobile version