NTV Telugu Site icon

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ ఈరోజే లాస్ట్..

Fish Prasadam

Fish Prasadam

Fish Prasadam: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఈరోజే చివరి రోజు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు అది గమనించాలని అధికారులు సూచించారు. నిన్నటి మాదిరిగానే ఈరోజుకూడా ఉదయం నుంచి నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. టోకన్లను తీసుకుని అందరూ లైన్ లో నిలబడి చేప ప్రసాదం స్వీకరించాలని సూచించారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.

నిన్న ఒక్కరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చేవారు పెద్ద సంఖ్యలో వచ్చారని వెల్లడించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడిందని పేర్కొన్నారు. రెండురోజుల నుంచే నాంపల్లి గ్రౌండ్ కు ఆస్తమాతో బాధపడుతున్నవారు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం రెండు రోజుల ముందు నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.

Read also: Ramoji Rao: నేడు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

అయితే చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో అక్కడున్న వారు తట్టి లేపిన ఆ వ్యక్తిలో చలనం లేకపోవడంతో స్థానికులు అక్కడే వున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న మహిళా పోలీసు సృహతప్పిన వ్యక్తిపై నీళ్లు చెల్లింది. వ్యక్తి స్పందించలేదు. సీపీఆర్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో అంబులెన్స్ ను పిలిపించారు. వెంటనే అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అయితే సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తితో ఎవరు వచ్చారు? నిజామాబాద్ నుంచి ఆ వ్యక్తి ఒక్కడే వచ్చాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

అయితే చేప మందుతో ఆస్తమా లేకుండా చేసుకుందామని వచ్చిన వ్యక్తి కానరాని లోకానికి వెళ్లిపోయాడు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు వస్తే.. వ్యక్తే మృత్యువాత పడ్డాడని కన్నీరుమున్నీరయ్యారు. వ్యక్తి మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనిపిస్తే వారు నిలబడిన చోటే సేదతీరాలని తెలిపారు. క్యూ లైన్ ల్లో నిలబడివారు జాగ్రత్తగా వుండాలని కోరారు.
Secendrabad: సిగ్నల్‌ పడుతుందని స్పీడ్ పెంచిన డ్రైవర్.. మూడు సార్లు పల్టీ కొట్టిన కారు..