NTV Telugu Site icon

TS BJP : గందరగోళంలో సీనియర్ అసమ్మతి నేతలు..

తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజేసుకుంటున్నాయి. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో గతంలో భేటి అయిన నేతలే మరోసారి భేటి అయినట్టు సమాచారం. కరీంనగర్ నేతలతో పాటు హైదరాబాద్ కి చెందిన నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గుజ్జుల రామ కృష్ణ రెడ్డి, సుగుణాకర్ రావు, వెంకట రమణి, రాములు మరికొందరు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ లో పాతవారికి ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. కొత్తగా వచ్చిన వారిలో ఎందరు గెలుస్తారు అని వారు ప్రశ్నించారు.

మేము పార్టీ ని వీడే ప్రసక్తే లేదని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే మా లక్ష్యం అని వారు వెల్లడించారు. మేము పని చేయనిదే పార్టీ అభివృద్ధి చెందిందా అని, మాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా అని వారు మండిపడ్డారు. ఇది కొందరు సమస్య కాదు పార్టీలో వందలాది మంది కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య అని వారు స్పష్టం చేశారు. త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, సమావేశాలకి పిలవడం లేదు… పాత వాళ్ళు పార్టీ కి దూరం అవుతున్నారని వారు తెలిపారు.