NTV Telugu Site icon

Revanth Reddy: రాహుల్‌ పై వేటు.. కాంగ్రెస్‌ నాయకులు ఏమన్నారంటే..

Revanhtreddy

Revanhtreddy

Revanth Reddy: రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్‌ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ వర్గాలు మండిపడుతున్నారు. రాహుల్‌ గాంధీపై అర్హత వేటు సరికాదని గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని అన్నారు. అవసరమైతే మా ఎంపీ పదవిని కూడా వదులుకుంటామని, కాంగ్రెస్ ఎంపీలమంతా పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమణ తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, ఎంపీ ల రాజీనామాలపై పార్టీలో చర్చ జరుగుతుందని, చర్చ చేసి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.

ఎవరెవరు ఏమన్నారంటే..

రేవంత్ రెడ్డి

మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. తన మిత్రుల కోసం మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 7న బీజేపీ ప్రభుత్వాన్ని నిండు సభలో ఆదానీ కుంభకోణంపై ప్రశ్నించారని, దీంతో మోదీ ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి అని అన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ ఆదానీ-ప్రధాని అని ఎద్దేవ చేశారు. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనపై కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని రాహుల్ పై కుట్ర చేసి ఆయనపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు. హడావుడిగా రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అనర్హుడిగా ప్రకటించిందని నిప్పులు చెరిగారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమణ తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, ఎంపీ ల రాజీనామాలపై పార్టీలో చర్చ జరుగుతుందని, చర్చ చేసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

మాజీ పీసీసీ చీఫ్‌ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆధాని పై 7 ఫిబ్రవరి లో రాహుల్ మాట్లాడారని, ఆధాని గురించి మాట్లాడిన తరవాత 16 ఫిబ్రవరి నాడు గుజరాత్ హైకోర్టుకి పిటిషనర్ వెళ్ళాడని, 27 ఫిబ్రవరిలో కేసు మళ్ళీ ఓపెన్ చేశారని ఉత్తమ్ తెలిపారు. మార్చి 23 నాడు రాహుల్ కి శిక్ష వేశారని, నెల రోజుల్లో తీర్పు వచ్చిన కేసు ఇదే అని, ఈతీర్చ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. శిక్ష వేసిన తీర్పు కాపీ రాకముందే వేటు వేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని అనర్హత వేటు వేయడం దుర్మార్గ చర్య అన్నారు. కాగా.. ఉత్తమ్… రేవంత్ మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. కొత్త పార్లమెంట్ భవనం ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని ఉత్తమ్ ని రేవంత్ అడిగారు. ఇంకా కాలేదన్న ఉత్తమ్. అది ఓపెన్ అయ్యే సరికి మనం సభ్యులుగా ఉంటామో లేదో నన్న ఉత్తమ్.. రెండు.. మూడు రోజుల్లో ఏమవుతుందో చూడాలి అన్న ఉత్తమ్ ఆశక్తికర మాటలు కొంత హాస్యాన్నిచ్చిన చర్చకు దారితీసాయి. సభ్యులగా ఉంటామో లేదో అన్న మాట చర్చకు దారితీస్తోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాహుల్ గాంధీని అన్యాయంగా అనర్హత వేటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కంటతడి పెట్టే అంశం అన్నారు. రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన వదులుకున్న గొప్ప నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. అదాని గుట్టు బయట పెడతారని రాహుల్ గాంధీ పై వేటు వేశారని అన్నారు. అవసరమైతే మా ఎంపీ పదవిని కూడా వదులుకుంటామన్నారు. కాంగ్రెస్ ఎంపీలమంతా పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు.

రేణుకా చౌదరి

పార్లమెంట్ లో సూర్పణక అని అన్నారని, మోడీ మీద కేసు పెడుతున్నానని కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేణుకా చౌదరి అన్నారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నానని తెలిపారు. సూర్పణక ఏ కులం.. Oc అయితే కాదు కదా? అంటూ వ్యంగాస్త్రం వేశారు. నేను కూడా కర్ణాటక లో bc నే అన్నారు రేణుకా. దక్షిణ భారత దేశం అంటే మోడీకి చిన్న చూపు అంటూ మండిపడ్డారు.

జగ్గారెడ్డి

రాహుల్ పై వేటు కుట్ర పూరితమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎదుర్కోలేక ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం రాహుల్ ది అన్నారు. అనర్హత వేటు మంచికే.. పార్టీకి లాభమే కానీ నష్టం కాదన్నారు. రాహుల్ గాంధీ కోసం దీక్ష చేస్తున్నామన్నారు. అందుకే గాంధీ భవన్ వచ్చినానని తెలిపారు. నేను గాంధీ భవన్ ఎందుకు రావడం లేదు అనేది ఇప్పుడు చర్చ కాదు. నో కామెంట్స్ అంటూ దాటివేశారు జగ్గారెడ్డి.
Jagityal : రూ.200కోసం కొడుకును చంపిన తండ్రి