NTV Telugu Site icon

Raghunandan Rao: కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు

Raghunanadan Rao

Raghunanadan Rao

BJP MLA Raghunandan Rao: ఎన్నికల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని బిజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. వెంట వెంటనే ఫలితాలు ఇవ్వాలని కోరారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మేము ఆశించిన దానిలో తప్పు లేదన్నారు. ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మొదటి నాలుగు రౌండ్స్ లో 47 మందే అభ్యర్థులు ఉన్నారని, ఐదో రౌండ్ లో కూడా 47 మంది అభ్యర్థులే ఉన్నారని అన్నారు.

read also: Etala Rajender: టెక్నికల్ గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు

5వ రౌండ్ ఫలితాల విడుదలలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. ఇక నాలుగు రౌండ్లలో ఎక్కువ మంది అభ్యర్థులు లేరా, ఐదవ రౌండ్ లోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారా? అని నిలదీశారు. 1,2,3,4 రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరా? అని నిలదీసిన రఘునందన్ రావు దీనిపై ఎవరెవరికి ఫిర్యాదు చేయాలనేది పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Etala Rajender: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుంది

Show comments