NTV Telugu Site icon

Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా..

Asha Workers Sharna

Asha Workers Sharna

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశాల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని పేర్కొన్నారు.

Read also: Telangana Govt: తెలుగు పాఠ్య పుస్తకాలపై గందరగోళం.. సీఎంగా కేసీఆర్ పేరు..

గతంలో ఇచ్చినట్లు ఆశాలకు ప్రతినెలా 2వ తేదీన పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలని తెలిపారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. 2024 మార్చి 3-5 వరకు 3 రోజుల పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Pune Porsche Crash Case: పుణె కారు ప్రమాదం కేసులో డాక్టర్ క్రిమినల్‌ నెట్‌వర్క్‌..!