NTV Telugu Site icon

Dharmapuri Arvind: రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడు.. అరవింద్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Arvind Dharmapuri

Arvind Dharmapuri

Dharmapuri Arvind: అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు గుప్పించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అరవింద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం అసాధ్యమని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 10న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ క్రమంలో సేల్ ముగియకముందే షాపింగ్ చేయండి.. అంటూ రేవంత్ రెడ్డిపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ను మించిన మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ తక్కువేనన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు లేడన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళితే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని త్వరలో వెల్లడిస్తానని అన్నారు. ఈ నెల 7న బీసీ సమ్మేళనం, 11న ఎస్సీ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారని అరవింద్ తెలిపారు. ఆయన కోర్టుల్లో కనిపించడం లేదని… కనిపించడం ప్రారంభిస్తే మరెవరూ కనిపించరని కొందరు నేతలు అంటున్నారు. రేపు మెట్ పల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అరవింద్ తెలిపారు.

ఇవాళ జగిత్యాల జిల్లా మెట్‌పట్టి పట్టణంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి ఆధ్వరంలో బీజేపీ భారీ ర్యాలీ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభకానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అరవింద్‌ పాల్గొననున్న భారీ ర్యాలీ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాలు చేశారు. అయ్యప్ప ఆలయం వద్ద భారీగా బీజేపీ నేతలు పాల్గొనే అవకావం ఉన్నందున అక్కడి నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. ప్రయాణికులు గమనించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్‌ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్‌!