Site icon NTV Telugu

కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాస రావు నివేదిక…

కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్ శ్రీనివాస రావు. మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష పరీక్షలు జరుగుతున్నాయి అని తెలిపిన డీహెచ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయి. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చాం.మిగతా 15వేల పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో 132 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించింది. నిలోఫర్ ఆస్పత్రుల్లో మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిల్లల కోసం 4వేల పడకలు సిద్ధం చేస్తున్నాం. సిబ్బంది పెంపునకు, శిక్షణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అని డీహెచ్ పేర్కొన్నారు.

Exit mobile version