NTV Telugu Site icon

DH Srinivasa Rao: ముగ్గు వేయండి గోల్డ్ గెలవండి.. ఈ ఆఫర్ వాళ్లకు మాత్రమే..

Dh Srinivas

Dh Srinivas

DH Srinivasa Rao: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతాయి. సంక్రాంతి సంబరాలు ఏ ఇంటి ముంగిట చూసినా అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిపిడకలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, కొమ్మదాసుల సరదాలు కనువిందు చేస్తాయి. ఇప్పటికే పట్టణం పల్లె బాటపట్టింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతిని ముందస్తుగా జరుపుకుంటున్నాయి అనేక గ్రామాలు. అయితే కొత్తగూడెంలో ముగ్గుల పోటీలను తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ దిగి వాట్సాప్ సందేశం పంపి బంగారం వెండి గెలుచుకోండంటూ ట్వీట్‌ చేశారు. లక్కీ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇందులో మొదటి 10 మంది విజేతలకు ఒక గ్రాము బంగారాన్ని అందజేస్తారు. తదుపరి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం ఇవ్వబడుతుందని తెలిపారు. అయితే ఇది భద్రాద్రికొత్తగూడెం మహిళలు, యువతులకే పరిమితమైంది.

మండల పరిధిలోని ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని బంగారు నాణేలు గెలుచుకోవచ్చని గడల శ్రీనివాసరావు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పండుగకు మీ ఇంటి ముందు పెట్టుకున్న ముగ్గుతో సెల్ఫీ లేదా సెల్ఫీ వీడియో తీసి జనవరి 15 సాయంత్రం 6 గంటల లోపు మీ పేరు, గ్రామం, మండల వివరాలతో వాట్సాప్ చేయాని కోరారు. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని డీహెచ్ ప్రకటించారు. అయితే ఎంపిక అయిన విజేతలకు జనవరి 26న శ్రీనగర్ కాలనీ, కొత్తగూడెంలో సాయంత్రం 5 గంటలకు బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించారు.
Jaru Mitai Song: ఏదో కామెడీ చేశాం కానీ.. ఈ “జారు మిఠాయ” సాంగ్ వెనుక ఇంత కథ ఉందా?