కు.ని వికటించిన కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. 30 మంది మహిళలను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈరోజు 11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు. చికిత్స పొందుతున్న 18 మందిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. బాధిత మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆపరేషన్స్ చేసిన వైద్య సిబ్బందిని విచారణ చేశామని అన్నారు. వసతులు, ఆపరేషన్ థియేటర్ పని తీరు, పారదర్శకమైన స్పష్టతను ఒకట్రెండు రోజుల్లో అందిస్తామన్నారు. రాష్ట్రంలో 12 లక్షలకు పైగా ఆపరేషన్స్ నిర్వహించామన్నారు. 30 నుంచి 60 ఆపరేషన్స్ ప్రతీ క్యాంపుల్లో జరుగుతాయని అన్నారు. ఈ ఆపరేషన్స్ చేసిన డాక్టర్ వెంటనే మరో క్యాంపులో ఆపరేషన్స్ చేశారని, వాళ్ళు క్షేమంగా ఉన్నారని అన్నారు. 2,3 నిమిషాల్లో కు.ని ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్స్ ఉపయోగించిన పరికరాలు ఇతర వస్తువులను పరిశీలించామని, ఇన్ఫెక్షన్ వచ్చింది, స్టీరిలీటిలో లోపం జరిగి ఉంటుందని అన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు రావాల్సి ఉందని, భాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, పొరపాటు జరిగిందని, దాన్ని సరిదిద్దుకొంటామన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోనే అందరూ మహిళలు మళ్ళీ ఆసుపత్రిలో చేరారని స్పష్టం చేశారు. ఆపరేషన్స్ జరిగిన తర్వాత అందరి పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగి కూడా ఉండొచ్చు అని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
Harikrishna Birth Anniversary: తండ్రి జయంతి రోజున భావోద్వేగ ట్వీట్ చేసిన ఎన్టీఆర్
