DGP Mahender reddy: గోషా మహల్ పోలీస్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని పోలీస్ అమరవీరులకు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, పలువురు సీనియర్ పోలీస్ ఉన్నత అధికారులు. రిటైర్డ్ పోలీస్ అధికారులు నివాళులర్పించారు. అమరులైన పోలీసుల సంపుటికను హోంమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీకి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విధినిర్వహణలో అశువులు బాషిన అమరులకు నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. దేశ, ధన, మాన ప్రాణాలను కాపాడుతూ విధినిర్వహణలో అమరులైన వారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని కోరారు. ఈ సంవత్సరం 264 మంది పోలీసులు విధినిర్వహణలో అమరులైన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేర రాహిత్య రాష్ట్రంగా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు కొనసాగిస్తోందని అన్నారు. పౌర హక్కులను కాపాడుతూ, ప్రజలకు నిరంతరం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. నేర రాహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే పద్ధతి లో భాగంగా అనేక సిసి కెమెరాలు,పోలీసు స్టేషన్లను అదునికరించి,ఫ్రెండ్లి పోలీస్ తో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలనుండి, గ్రామలవారిగా 10 లక్షల వరకు సీసీ కెమెరా లు ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో 15 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. పోలీస్ సంక్షేమమే దెయ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. పోలీసులకు నగదురహిత చికిత్సలు,పోలీస్ కుటుంబాలకు కార్పొరేట్ ఉచిత విద్య, విదేశీ విద్యకు నిధులు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశ సరసన చేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 11వేల అత్యాధునిక వాహనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిలువెత్తు నిదర్శనానికి కమాండ్ కంట్రోల్ భవనం అని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ముందుండడం గర్వకారణంగా చెప్పుకుంటున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నా నివాళులు అన్నారు.
Read also: UK Crisis: భారతదేశం బ్రిటన్‌ను వలసరాజ్యంగా మార్చుకోవాలి.. కమెడియన్ వీడియో వైరల్
ఇక హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీస్ అమరులకు.. చైనా దూరాక్రమనలో అమరులైన పోలీసుల అమరులకు నివాళులర్పించారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 264 మంది అమరులైన వారికి శ్రద్ధాంజలి గటించారు. దేశంలో శాంతి భద్రతల బాగుంటేనే దేశ అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని, మతతత్వ సెత్రువులను పెరగకుండా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ పడుగల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో కృషి చేశారన్నారు. మరింత ప్రతిష్టంగా విధులు నిర్వహించడానికి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. దేశం కోసం అమరులైన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి గటిస్తున్నానని అన్నారు.
గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరులదినోత్సవ కార్యక్రమంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర అమరులైన పోలీసులకు నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. సీపీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు డిపార్ట్ మెంట్ అండగా ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 264 మంది అమరులైన వారందరికి నివాళలర్పించారు. అమర జవానులు త్యాగాలు, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల గుర్తుగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామన్నారు. కష్టాలలో ఉన్నప్పుడు దేవుడిని వేడుకున్నా ముందు వచ్చేది పోలీసులే అని పేర్కొన్నారు. ప్రజల మాన, ధన లను కాపాడేదీ పోలీసులే అని తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణే కాకుండా సమాజంలో అన్ని మార్పులకు అణుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. డయల్ హడ్రెడ్ కు కాల్ చేస్తే వెంటనే పోలీసులు అక్కడ ప్రత్యక్షమైతారని కొనియాడారు. మారుతున్న కాలానికణుగుణంగా పోలీసులు కష్టపడుతున్నారని.. పండుగలు, శుభకార్యాలుకు పహారా కాసేది పోలీసులే అంటూ సీపీ అన్నారు.
Bus Catches Fire: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు..