NTV Telugu Site icon

లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్…

సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం అని తెలిపారు. రోడ్ల పైకి రాకుండా వంద శాతం లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలి. పోలిస్ అధికారులకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సూచించడం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఫార్మా పరిశ్రమ అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇతర పరిశ్రమల వారు లాక్ డౌన్ సడలించిన 4 గంటల్లో వారి పనులు చక్కబెట్టుకోవాలి అని సూచించారు.