NTV Telugu Site icon

Hyderabad: కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్

Dgp Mahender Reddy

Dgp Mahender Reddy

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్, పెట్రోలింగ్ సిస్టమ్‌ను సైబరాబాద్ సీపీ స్టెఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల భ్రదత కోసమే తాము అనేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ అన్నారు. హైదరాబాద్‌కు తలమానికమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రక్షణ కోసం 67 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్‌కు ఈ కెమెరాల్ని అనుసంధానం చేశామని చెప్పిన ఆయన, ఈ కెమెరాల ఏర్పాటుకు రహేజా గ్రూప్ సహాయ సహకారాలు అందించిందన్నారు.

Read Also: Telangana: కేఆర్‌ఎంబీకి మరోలేఖ.. 50:50 నిష్పత్తిలో నీళ్లు..!

దుర్గం చెరువును సందర్శించేందుకు వచ్చే విజిటర్స్ రక్షణ కోసమే ఈ వ్యవస్థని ఏర్పాటు చేశామని, అలాగే లేక్ పోలీసింగ్ కూడా ఉందని చెప్పారు. దుర్గంచెరువు గస్తీ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్, బోటింగ్ వంటి వాటిని నియమించామన్నారు. సైబరాబాద్ సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉందని, తెలంగాణలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఐటి ఏరియాల్లో రక్షణ బాగా ఉండడం వల్లే అనేక కంపెనీలు హైదరాబాద్‌కి తరలి వస్తున్నాయని చెప్పారు. ప్రజల రక్షణ పోలీస్ వ్యవస్థ మొదటి కర్తవ్యమని డీజీపీ వెల్లడించారు.