NTV Telugu Site icon

రాజు ఆత్మహత్య పై అనుమానం అక్కరలేదు : డీజీపీ

సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడు అయిన రాజు పోలీసులకు చిక్కుండానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే ఈ ఘటనపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాజు ఆత్మహత్య విషయం లో ఎలాంటి అనుమానం అక్కరలేదు అని తెలిపారు. నిన్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఉన్న లోకో పైలట్ లు ఆత్మహత్య ను గమనించి … స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. అక్కడ పనిచేసే మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కూడా రాజు ను గుర్తించారు. పక్కనే ఉన్న రైతులు కూడా ఆత్మహత్య కు సాక్షులు. ఈ కేసులో మొత్తం ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ చేసాము అని డీజీపీ తెలిపారు. అయితే చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది