Kondagattu: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మినీ హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు పోటెత్తుతున్నారు. నిన్న అర్ధరాత్రి నుండి బారులు తీరిన భక్తులు రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అనే కీర్తనలతో కొండగట్టు మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో అంజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈ ఉత్సవాల్లో కొండగట్టు అంజన్నను 3 నుంచి 4 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా ఉండటంతో.. కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు. అయినా కూడా ప్రత్యేక పూజలు, దర్శనాలకు అనుమతించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జిత సేవలు లేనప్పుడు ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కొండగట్టు దేవస్థానంలో అర్చకుల ఇష్టారాజ్యంగా మారిందని అంటున్నారు.
Read also: Deepthi Sunaina: కొత్త కారు కొన్న దీప్తి సునైన.. కొత్త అనుమానాలు?
చాలా దూరం నుంచి వచ్చిన భక్తుల ఇబ్బందులు తప్పడం లేదని, సాధారణ భక్తుల దర్శనంకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంజన్న సన్నిధిలో అక్రమ వసూళ్లు చేస్తున్నారని మండపడుతున్నారు. కొండగట్టులో కొందరు అర్చకులు వీఐపీ దర్శనాల దందా చేస్తున్నారని ఆరోపించారు. వీఐపీలు రాగానే గర్భ గుడికి సంబంధం లేని ఓ అర్చకుడి హడావుడి చేస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తు భక్తులకు ఆటంకం కలిగించారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు పై అధికారులు పట్టించుకోవాలని తెలిపారు. కొంతమంది అర్చకులు చేస్తున్న పనుల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Allu Arjun: అల్లు అర్జున్ పై కేజీఎఫ్ నటుడు కీలక వ్యాఖ్యలు