NTV Telugu Site icon

Peddagattu jathara: పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు.. అసౌకర్యాలు కలగకుండా చర్యలు

Peddagutta Jatara

Peddagutta Jatara

Peddagattu jathara: తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర, ప్రారంభమై నేటికి రెండోరోజు. నిన్నటి నుంచి శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మల దర్శనార్థం భక్తుల రాక పెరుగుతూనే ఉంది. అయితే జాతరకు వెలుతున్న ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఉదయం 8:30 దాటినా కూడా రహదారిపై పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కోదాడ, విజయవాడ, హైదరాబాద్ రహదారిపై పొగ మంచు కమ్ముకుంది. దీంతో రహదారిపై వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్తున్నాయి. సూర్యాపేట సమీపంలోని జరుగుతున్న పెద్దగట్టు జాతరకు వెళ్లే భక్తులు సైతం తమ వాహనాలను చిన్నగా వెళుతున్నారు. దీంతో ఆయా చౌరస్తాల వద్ద ఏర్పాటుచేసిన భారీ గేట్లతో పోలీసులు భక్తులకు సూచనలు ఇస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్‌.. కారణం ఇదే..

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఈసారి 15 లక్షల మందికి పైగా భక్త జనం వచ్చే అవకాశం ఉందని పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జాతర మొదటి రోజైనా గంపల ప్రదర్శన రాత్రి నిన్న వైభవంగా నిర్వహించారు. ఇవాళ, రేపు పెద్దగట్టు పైకి భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తంది. ఈ మూడు రోజులలో ఆదివారం రాత్రి నుండి సోమవారం, మంగళవారం సాయంత్రం వరకు పోలీసులకు ట్రాఫిక్ సమస్యను అదుపులో ఉంచడం కత్తి మీద సాములా మారింది. ఈసారి జాతరలో పోలీసుల ముందు చూపుతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి చర్యలు శాశ్వతంగా చేపట్టారు. జాతరలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తొలగిపోతుండటంతో రెండవది భక్తుల రద్దీ ని కూడా తగ్గించి, దర్శనం కూడా సజావుగా అయ్యేలా పోలీస్ శాఖ కసరత్తులు చేస్తుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మరో 500 మంది వలంటీర్లను నియమించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు.
MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ