NTV Telugu Site icon

Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..

Karthika Masam

Karthika Masam

Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.

Read also: Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..

రాష్ట్రంలోని వేములవాడ, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భద్రాచలం వద్ద భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు

కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. తెల్లవారుజామునుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. రాజన్న ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆది దంపతుల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నది స్నానానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీతో గోదావరి నది తీరాన స్నాన ఘట్టాలు కోలాహలంగా మారాయి. స్నానాల అనంతరం గోదావరి నదిలో పుణ్యదీపాలు వెలిగించి నీటిలో వదిలిన అనంతరం దర్శనానికి శివాలయానికి చేరుకుంటున్న భక్తులు.

Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి వాతావరణం కనిపించింది. త్రివేణి సంగమ గోదావరి‌ నదిలో భక్తుల పుణ్యస్నానాలు.. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు,ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌