అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు. బస్సులపై రాళ్లు రువ్వారు. స్టేషన్‌లో హౌరా ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది.
అగ్నిపథ్ స్కీమ్ రద్దుచేయాలని, యధాతతంగా ఆర్మీ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని డిమాండ్ చేసారు. ఈ సంఘటనను రాజకీయ నాయకులు ఉపయోగించుకోవడం సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం. మమ్మల్యే మీరు కొడతారా అంటూ పోలీసులను నిలదీసారు. అగ్నీపథ్ స్కీమ్ ను పెట్టి మాకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. మీడియా వారికి సహాయం చేయాలని వారు కోరారు. ఎగ్జామ్ పెట్టాల్సిందే అంటూ నినాదాలు చేసారు. మా కుటుంబాలు రోడ్డున పడతున్నాయని, మాకు యధాతథంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. రెండు సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు ఏం కావాలని ప్రశ్నించారు. మాకు కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు.
రైళ్లకు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు. రైళ్లపై రాళ్లు విసరడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
https://www.youtube.com/watch?v=oNhnkAMnCds
