NTV Telugu Site icon

Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..

Women Ias

Women Ias

Women IAS: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజులముందే జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సదరు అధికారి ట్వీట్‌లను మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఒకటికి రెండుసార్లు రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటలకు నేరుగా ఆమె నివాసానికి కారులో వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు. అయితే.. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం.

Read also: Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్‌ ఇదే..

స్నేహితుడిని కారులో వదిలి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. ముందు స్లైడింగ్ డోర్ తెరిచి లోపలికి వచ్చి గది తలుపు తట్టాడు. డోర్ తెలిసిన మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఎదురుగా రావడంతో షాక్ తిన్నారు. కాస్త తేలికపడి నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావని గట్టిగా అడిగింది. వచ్చిన అతను నేను గతంలో మీకు ట్వీట్ చేశాను.. తన పని గురించి మాట్లాడేందుకు వచ్చానని బదులిచ్చాడని సమాచారం. దీంతో ఆగ్రహించిన ఆమె బయటకు వెళ్లాలని గట్టిగా అరిచినట్లు సమాచారం. దీంతో ముందుగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read also: Gold Price: బాబోయ్ బంగారం.. కొండ మీదే ఉన్న పసిడి

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పారిపోతున్న డిప్యూటీ తహసీల్దార్‌ను పట్టుకున్నారు. డీటీతో పాటు వచ్చిన స్నేహితుడిని కూడా స్థానిక పోలీసులకు అప్పగించారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాత్రిపూట ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి ఎందుకు వెళ్లాడు? ఏదైనా దురుద్దేశంతో వెళ్లాడా లేక అసలు ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితమే ఈ ఘటన జరిగిన బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడటం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. మహిళా అధికారికే వేధింపులు ఎదురయ్యాయి అంటే నగరంలో మహిళలపై దారుణాలకు నిదర్శనమని రాష్ట్రప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంత సెక్యూరిటి వున్నా కూడా అతన్ని ఆపలేకపోయారంటూ చర్చజరుగుతుంది. ఈవార్త బయటకు రావడంతో.. తెగవైరల్‌ అవుతోంది.
Republic Day TerrorAttack: ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే 5లక్షల డాలర్లు ఇస్తా ఎస్‌ఎఫ్‌జే ప్రకటన

Show comments