Site icon NTV Telugu

TS EAMCET 2022: అలర్ట్‌.. నేటి నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్‌ ..

Ts Eamcet 2022

Ts Eamcet 2022

ఎంసెట్ ప్రవేశ ప‌రీక్ష‌కు స‌ర్వం సిద్దం చేశారు అధికారులు. కానీ.. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు అనుమతించరని తేల్చిచెప్పింది. అయితే.. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట సమయానికన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ పరీక్షలు ఈ నెల నేడు, రేపు, ఎల్లుండి (18, 19, 20) తేదీల్లో జరుగుతాయి. విద్యార్థులు మొత్తం 1,72,241 మంది ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. కాగా.. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాగా.. రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించ‌నున్నారు. ఎంసెట్‌ పరీక్షల కోసం 108 కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో తెలంగాణలో 89 కాగా, ఏపీలో 19గా ఉన్నాయి. అయితే.. ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలను రాసే విద్యార్థుల కోసం హాల్‌టికెట్లపై సెంటర్ల రూట్ మ్యాప్ ను ముద్రించారు.

ఈనేప‌థ్యంలో.. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని అధికారులు వెల్ల‌డించారు. ఎంసెట్ పరీక్ష కేంద్రాల వద్ద వైద్య బృందాలనూ సిద్ధంగా ఉంచనున్నారు. 2022 సంవ‌త్స‌రంలో.. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. అయితే.. 70 శాతం సిలబ్‌సతోనే ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈనేప‌థ్యంలో.. ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా వాటిని రద్దు చేశారు. అయితే.. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవ‌కాశాలు వున్నాయి. వాన‌లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి పాఠశాలలతోపాటు కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ప్రారంభంకానున్నాయి.

Indiana Mall Shooting: అమెరికాలోని ఇండియానా మాల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

Exit mobile version